Tuesday, 1 August 2017

నీకు నువ్వే బ్రాండ్‌ జాబ్ సెర్చ్‌లో ఇమేజ్‌ బిల్డింగ్‌


నీకు నువ్వే బ్రాండ్‌ జాబ్ సెర్చ్‌లో ఇమేజ్‌ బిల్డింగ్‌















         ప్రస్తుత డిజిటల్‌ యుగం అంతా బ్రాండింగ్‌ చుట్టూ పరుగెడుతోంది. ఒక ప్రొడక్ట్‌ ఉత్పత్తి ఖర్చు కంటే వినియోగదారులను ఆకట్టుకోవడానికి చేసే బ్రాండింగ్‌ కే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. బ్రాండింగ్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలకూ ఇదే వర్తిస్తుంది. జాబ్‌ సీకర్‌గా మార్కెట్‌లో సక్సెస్‌ కావాలంటే మిమ్మల్ని మీరు మంచి బ్రాండ్‌గా ప్రమోట్‌ చేసుకోవాలి. మీ అర్హతలు, నైపుణ్యాలను ఒక బ్రాండ్‌గా మార్కెట్‌ చేసుకోవాలి. అప్పుడే మిగతా వారి కంటే విలువైన వారిగా నిరూపించుకోగలుగుతారు.
కొన్ని రంగాలు రెజ్యూమె నుంచి విజ్యూమె(వీడియో రెజ్యూమె) దిశకు ఎప్పుడో మారాయి. ఎంప్లాయర్స్‌ ప్రాధాన్యం మారుతున్న నేపథ్యంలో ఇలాంటి రంగాలకు వెళ్లాలనుకునే వారు ఉద్యోగ వేటను విజయవంతంగా ముగించాలంటే కొత్తగా ట్రై చేయాలి. ఆ కోణంల్లోంచి వచ్చిందే పర్సనల్‌ బ్రాండ్‌. అవకాశాలను క్రియేట్‌ చేసుకుంటూ ఇండస్ర్టీ కోరుకుంటున్న డైనమిక్‌ పర్సన్‌గా ప్రొజెక్ట్‌ చేసుకోవాలి. దీనికి పర్సనల్‌ బ్రాండ్‌ను మించిన సాధనం మరోటి లేదు. అసలు పర్సనల్‌ బ్రాండ్‌ అంటే ఏమిటి? దాన్ని ఏ విధంగా బిల్డ్‌ చేసుకోవాలో చూద్దాం.
వ్యక్తిత్వ ఆవిష్కరణ
పర్సనల్‌ బ్రాండ్‌ అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడం. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేలా తమలో స్వతహాగా ఉండే స్ర్టాంగ్‌ పాయింట్స్‌ను ఒక నిర్ధిష్ట క్రమంలో ప్రజెంట్‌ చేసుకోవడమే బ్రాండ్‌. ఈ క్రమంలో తమలోని బలాలు, బలహీనతల ఆధారంగా ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. దాని ద్వారా మీ వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు చేసుకుంటే రిక్రూటర్స్‌ బెస్ట్‌ ఛాయి్‌సగా మీరు నిలుస్తారు. అంతేకానీ పర్సనల్‌ బ్రాండ్‌ అంటే మీకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం కాదు.
కీలకం..లక్ష్యం
పర్సనల్‌ బ్రాండ్‌ను బిల్డ్‌ చేసుకునే క్రమంలో కీలక అంశం..లక్ష్యం. ఆ లక్ష్యం జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. ఒక ఇంటర్వ్యూకు హాజరైతే ఎంప్లాయర్‌ ముందు మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్‌ చేసుకుంటారు? వచ్చే ఐదేళ్లలో ఏ పొజిషన్‌లో స్థిరపడాలనుకుంటున్నారు? ఈ అంశాలపై స్పష్టత ఉండాలి. అప్పుడే భవిష్యత్‌ లక్ష్యాలు ఏమిటో అవగాహనకు వస్తుంది. ఆ క్రమంలో పర్సనల్‌ బ్రాండ్‌ను ఏవిధంగా రూపొందించుకోవాలి అనే విషయంపై స్పష్టత ఏర్పడుతుంది.
ఆన్‌లైన్‌ యాక్టివిటీ
ప్రస్తుతం ఎంప్లాయర్స్‌ ఉద్యోగార్దుల ఆన్‌లైన్‌ యాక్టివిటీని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. పర్సనల్‌ బ్రాండ్‌ను అత్యంత ప్రభావితం చేసే వాటిలో ఇది ఒకటి. కాబట్టి జాబ్‌ సీకర్‌గా మిమ్మల్ని మీరు బ్రాండింగ్‌ చేసుకునే క్రమంలో ఒక్కసారి మీ పేరును గూగుల్‌లో సెర్చ్‌ చేయండి. ఆ క్రమంలో వచ్చే స్టఫ్‌ను పరిశీలించండి. ఇది మీ బ్రాండ్‌ ఇమేజ్‌ను చాలా వరకు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ లేదా ఆన్‌లైన్‌లో మీ పేరును సెర్చ్‌ చేస్తే వచ్చే స్టఫ్‌ హుందాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ సందర్భాల్లో చేసిన పోస్టింగ్స్‌, కామెంట్స్‌ల్లో అనవసరమైన వాటిని తొలగించాలి. ఆన్‌లైన్‌లో చక్కని రెప్యుటేషన్‌ క్రియేట్‌ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
నెట్‌వర్క్‌ విత్‌ రైట్‌ పీపుల్‌
నెట్‌వర్క్‌ విత్‌ రైట్‌ పీపుల్‌. అంటే జాబ్‌ సీకర్‌గా బ్రాండింగ్‌ చేసుకునే క్రమంలో సంబంధిత రంగంలోని ప్రొఫెషనల్స్‌ మీ నెట్‌వర్క్‌లో ఉండేలా చూసుకోవాలి. ఏ రంగంలో పని చేయాలనుకుంటున్నారో అందుకు సంబంధించిన కంపెనీల ప్రొఫైల్స్‌ను నిత్యం ఫాలో కావాలి. మీ రంగంలోని గ్రూప్స్‌, ఫోరమ్స్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అందులోని డిబేట్స్‌లో చురుగ్గా పాల్గొనాలి. సంబంధిత ఇండస్ర్టీ ఎక్స్‌పర్ట్స్‌తో నిత్యం టచ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలి. తద్వారా మీపై బ్రాండ్‌పై ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది. తద్వారా వారిలో ఎవరైనా తమ దృష్టిలో ఉన్న అవకాశాలకు మిమ్మల్ని రిఫర్‌ చేయవచ్చు.
బెస్ట్‌ ఇంప్రెషన్‌
ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌. కాబట్టి పర్సనల్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో ఆహార్యం కూడా కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక చిరునవ్వు, ఆత్మీయమైన పలకరింపు, హ్యాండ్‌ షేక్‌, హుందాతనంతో కూడిన డ్రెస్సింగ్‌ వంటివి బెస్ట్‌ ఇంప్రెషన్‌గా నిలిచిపోతాయి. కాబట్టి డ్రెస్సింగ్‌, బాడీ లాంగ్వేజ్‌ ఒక ప్రొఫెషనల్‌ను తలపించేలా హుందాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిరంతరం
బ్రాండింగ్‌ అనేది సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ తరహాదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ప్రొడక్ట్‌కు అప్‌డేటెడ్‌ వర్షన్‌ ఎలా వస్తుందో, అదేవిధంగా పర్సనల్‌ బ్రాండ్‌ను కాలానుగుణంగా అప్‌డేట్‌ చేసుకోవాలి. అందుకే బ్రాండింగ్‌ నిరంతర ప్రక్రియ. సంబంధిత రంగానికి చెందిన నాలెడ్జ్‌, స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. మెరుగైన అవకాశాలను అందుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి. ఆశావహ దృక్ఫథంతో, రెడీ టు లెర్న్‌ ఆటిట్యూడ్‌ను కలిగి ఉండాలి.

No comments:

Post a Comment