Monday, 8 May 2017

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా


ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో జరగాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షను జులై 15, 16 తేదీలకు వాయిదా వేసింది. అలాగే జులై రెండో వారం జరగాల్సిన పంచాయతీ మెయిన్స్‌ పరీక్షను కూడా జులై 30కి వాయిదా వేసింది. అభ్యర్థుల విన్నపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ వివరించింది. సిలబస్‌లో వ్యత్యాసం ఉన్నందున అభ్యర్థులకు గడువు ఇవ్వాలని భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment