APPSC చైర్మన్ గారికి విన్నపం
* అయ్యా! చైర్మన్ గారు, మీ భిన్నమైన ప్రశ్నావళి గ్రూప్ 2 పేపర్ లో 5000 మంది అభ్యర్థులు 100 మార్కులు పైగా సాధించారు. 150 మార్కుల ప్రశ్నాపత్రం తయారుచేసి 3 ప్రశ్నలు ఎత్తేస్తిరి. పేపర్ ప్రామాణితకత పై ఏమైనా ఆలోచించారా?
👉 గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడానికి ఇబ్బందిగా ఉంది. సిబ్బంది లేరు అంటున్నారు. మీకు సిబ్బంది లేక ఇబ్బందులు ఉంటే అభ్యర్థులను ఎందుకు ఇబ్బంది పెడతారు. 👉 గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కు అప్పుడే డబ్బులు చెల్లించాం. అవి వృధా అవుతాయి అంటున్నారు. మేం ఒక్కొక్కరం 250 రూ" పైగా చెల్లించాం. మీకు 5 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు 250 రూ" పైగా చెల్లించారు. అందులో ఇప్పుడు మీరు 49100 మందికి మాత్రమే మెయిన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాయిదా వేస్తే డబ్బులు వృధా అనే మీరు, మరి మిగతా నాలుగున్నర లక్షల మంది ప్రిలిమ్స్ క్వాలిఫై కానీ వారి డబ్బులను ఏం చేస్తారు? వాటిలో నుండి ఉపయోగించుకోండి.
👉 *మీ అభిప్రాయం చూస్తుంటే NTR విద్యోన్నతి క్రింద శిక్షణ పొందే BC,SC,ST లకు ఉద్యోగాలు రావడం ఇష్టము లేనట్లుంది.
👉 మీ ముక్కుసూటి ధోరణితో ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడి గారికి చెడ్డపేరు తేకండి.
👉 అభ్యర్థులు చేసిన పిర్యాదులో సహేతుకత లేదు అంటున్నారు. సహేతుకంగా ఎలా పిర్యాదు చేయాలో చెబితే అలానే ఫిర్యాదు చేస్తాం.
👉 వాయిదా వేస్తే కాలెండర్ ఇయర్కు సమస్య అంటున్నారు. ఇంకా పోస్టుల వివరాలు,రోస్టర్ పాయింట్ల వివరాలు, ఖాళీల వివరాలు తెలియని వాటి గురించి హైరానా ఎందుకు?
👉 2012 తర్వాత గ్రూప్ 2 ప్రకటన ఇప్పుడు వచ్చింది. మాకు కొంచెం టైమ్ ఇవ్వండి. మనసుంటే మార్గం ఉంటుంది. తేదీలు ఏదో ఒక నెలలో సర్దుబాటు చేయండి. కనీసం 2 నెలలు వాయిదా వేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment