Wednesday, 8 February 2017

ఉద్యోగానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి


డీటీలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి!

రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
 
హైదరాబాద్‌, ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): రెవెన్యూ శాఖలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు సన్నద్ధమవుతున్నారా? అయితే, ఈ ఉద్యోగం పొందేందుకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి! రెవెన్యూలో ఉపయోగించే సాధారణ సాప్ట్‌వేర్‌ల గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్షల్లో ఎంపికైన వారికి 3 నెలల వ్యవధిలోగా ‘కంప్యూటర్‌ టెస్ట్‌’ కూడా నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణులైన వారినే ఉద్యోగానికి ఎంపిక చేసి సెలక్షన్‌ లిస్టు ప్రకటించాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు డీటీ పోస్టుల నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని చేర్చనున్నారు. రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున పరిపాలనా సంస్కరణలను తీసుకొస్తున్న నేపథ్యంలో వెబ్‌ల్యాండ్‌ కాన్సెప్ట్‌ విజయవంతమైంది. ఇతర రాషా్ట్రలు కూడా ఈ విధానాన్ని అలవర్చుకుంటున్నాయి.

No comments:

Post a Comment