Sunday, 19 February 2017

జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ బుక్స్ ఉండాల్సిందే..!


జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ బుక్స్ ఉండాల్సిందే..!
స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ మొదలుకుని బ్యాంక్‌, సివి ల్స్‌, గ్రూప్స్‌, పోలీస్‌ సహా అన్ని రకాల పోటీ పరీక్షల్లో క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ కీల కం. ఇవేకాదు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ సెలె క్షన్స్‌లో పెట్టే పరీక్షలో ఈ ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. సాధారణంగా ఈ ప్రశ్నలు అన్నీ టెన్త్‌, ఇంటర్‌ స్థాయిలోనే ఉంటాయని చెపుతున్నప్పటికీ ప్రశ్నలు కఠినంగా ఉంటాయి.
 
అందుకే ఈ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రామాణిక పుస్తకాలతో ప్రాక్టీసు, రిఫర్‌ చేయాల్సి ఉంటుంది.. ఈ పరీక్షలు రాసే విద్యా ర్థులను ఉద్దేశించి మెక్‌గ్రాహిల్‌ ఎడ్యుకేషన్‌ ‘క్వాంటి టేటీవ్‌ ఆప్టిట్యూడ్‌’ పుస్తకాన్ని తీసుకు వచ్చింది. ఇది అన్ని పోటీ పరీక్షల విద్యార్థు లకు ఉపయుక్తంగా ఉంటుంది. ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ ఇచ్చే అభిజిత గుహ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఇందులో ప్రశ్నలను సాల్వ్‌ చేయడానికి కావాల్సిన టిప్స్‌, టెక్నిక్స్‌, షార్ట్‌కట్‌ మెథడ్స్‌ ఉన్నాయి. మొత్తం 25 చాప్టర్లు ఉన్నాయి. ప్రతీ చాప్టర్‌ నుంచి 30 నుంచి 40 రకాల ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు 752 భిన్నమైన ప్రశ్నలతో 110 స్పీడ్‌ టెస్ట్‌ పేపర్స్‌ కూడా ఇందులో ఇవ్వడం విశేషం.
 
Quantitative Aptitude for Competitive Examinations.
 
సివిల్స్‌ కాంటెంపరరీ ఎస్సేలు
 
సివిల్స్‌ మెయిన్‌ మొదటి పేపర్‌లో ఉపయోగ పడేలా మెక్‌గ్రాహిల్‌ ఎడ్యుకేషన్‌ ‘కాంటెంపరరీ ఎస్సే’లతో పుస్తకాన్ని తీసుకువచ్చింది. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ పూర్వ విద్యార్థి, రెండు దశాబ్దాలుగా సివిల్స్‌ విద్యా ర్థులకు బోధిస్తున్న డాక్టర్‌ రమేశ్‌సింగ్‌ ఈ పుస్తకాన్ని రూపొందించారు. 2013లో మెయిన్‌ పేపర్‌ను రీస్ట్రక్చర్‌ చేసిన తరువాత ఎస్సే పేపర్‌కు 250 మార్కులు కేటాయించారు. దీనిలో సోషియో ఎకనమిక్‌, పొలిటికల్‌ ఇష్యూలు అన్నీ ఈ పేపర్‌ పరిధిలోకి వస్తాయి. ఇంత ముఖ్యమైన అంశాలను స్పృశించాలంటే చాలా విస్తృతమైన అవగా హన ఉండాలి. ఈ ఉద్దేశంతోనే 40 ఎస్సేలను చాలా వివ రంగా ప్రచురించారు. ఎస్సేలు అంటే ఏమిటీ, పోటీ పరీక్షల్లో ఎస్సేలను ఎలా రాయాలి తదితర విష యాలను కూడా ఇందులో ప్రచురించడం విశేషం.
 
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌
 
యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన(యూపీఎస్‌సీ) ఏటా నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ప్రిపేరవుతున్న వారికోసం శ్రీతేజ పబ్లికేషన్స రెండు పుస్తకాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మొదటిది ‘సివిల్స్‌ ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌’. దీనిలో 1993 నుంచి 2016 వరకు నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు, వాటికి సమాధానాలను టాపిక్‌ల వారీగా ఇచ్చారు. భారతదేశ చరిత్ర, భూగోళ శాస్త్రం, భారత దేశ రాజకీయ వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, జనరల్‌ సైన్స, వర్తమాన అంశాలు-జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ ఇలా.. ప్రతి విభాగానికి సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించారు. ఇక రెండో పుస్తకం ప్రీవియస్‌ పేపర్స్‌ ఇయర్‌ వైజ్‌’. ఈ పుస్తకంలో కూడా 1993 నుంచి 2016 వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్న పత్రాలు, వాటికి సమాధానాలకు ఇచ్చారు. తెలుగులో సివిల్స్‌ ప్రిపరేషన మెటీరియల్‌ దొరకడం చాలా అరుదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ తేజ పబ్లికేషన్స్ వారు పై రెండు పుస్తకాలను తెలుగులో ముద్రించారు. తెలుగు మీడియంలో సివిల్స్‌ రాయాలనుకొనే అభ్యర్థులకు ఈ మెటీరియల్‌ బాగా ఉపయోగపడుతుంది.
 
పుస్తకం: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌ (ప్రీవియస్‌ పేపర్స్‌)
తెలుగు మీడియం ఇయర్‌ వైజ్‌
పేజీలు: 416
వెల: రూ.249
పుస్తకం: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌ (ప్రీవియస్‌ పేపర్స్‌)
తెలుగు మీడియం, టాపిక్‌ వైజ్‌
పేజీలు: 460 వెల: రూ.249

No comments:

Post a Comment