ఫేస్‌బుక్ వేదికగా ఉద్యోగావకాశాలు
చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు మీరంతా ప్రముఖ జాబ్ పోర్టల్స్‌లో మీ బయోడేటాను అప్‌లోడ్ చేసి ఉండిఉండొచ్చు. ఫలానా సంస్థలో ఉద్యోగాలున్నాయంటూ ఆయా పోర్టల్స్ నుంచి మీకు మెయిల్స్ వస్తుంటాయి. ఒకవేళ మీకు మెయిల్స్ రాకుంటే మీరు ఆయా జాబ్‌పోర్టల్స్‌కు లాగిన్ అయి ఎక్కెడెక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఇక గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే చాలు. ఇదే వేదికపై మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో చదువుకున్న ప్రతి వ్యక్తికీ ఫేస్‌బుక్ గురించి అవగాహను ఉంటుంది. ఇక యువతకైతే చెప్పక్కర్లేదు. ఫేస్‌బుక్‌లపై ఛాటింగ్‌లు, మెసేజ్ పోస్టింగ్‌లతో హోరెత్తిస్తుంటారు. ఇక స్మార్ట్‌ఫోన్‌లు పెరిగిపోవడంతో యువత ఫేస్‌బుక్‌కు మరింత చేరువైంది. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అదే యువతకోసం ఫేస్‌బుక్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఇచ్చిన వివరాలు,అర్హత ఆధారంగా సరిపోయే ఉద్యోగ వివరాలు పోస్ట్ చేయనుంది. అంతేకాదు ఆ ఉద్యోగానికి నేరుగా ఫేస్‌బుక్ నుంచే అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అక్కడే అప్లై అనే బటన్ పై క్లిక్ చేస్తే చాలు మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది అమెరికా కెనడా దేశాలలో మాత్రమే పనిచేస్తోంది. త్వరలో ఇతర దేశాలకు కూడా వర్తింప జేస్తామని ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది.
No comments:
Post a Comment