మాట్లాడే రెజ్యూమె
రెండు మూడు పేజీల సీవీలు పట్టుకుని కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం, వాళ్లు పిలు స్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడటం ఉద్యోగార్థులకు మామూలే. అయితే దీనికొక బెస్ట్ సొల్యూషన్ కనిపెట్టింది హ్యాపీమైండ్స్ మ్యాన్ పవర్ సొల్యూషన్స్. దానిపేరే సెల్ఫీ వీడియో రెజ్యూమె! వీడియో రెజ్యూమె ద్వారా ఆయా సంస్థలు అభ్యర్థిని ఎంచుకునే వీలు కల్పించింది. ఉద్యో గార్ధులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హ్యాపీ మైండ్స్ యాప్ డౌనలోడ్ చేసుకుని అందులో ఆప్షన్లను ఫాలో అవుతూ, మీ గురించి మీరు బ్రీఫింగ్ ఇవ్వ డమే. యాప్ ద్వారా మొబైల్‌లోని రియర్ వ్యూ కెమెరా ఓపెన అవుతుంది. రికార్డు బటన ప్రెస్ చేసి, మీ క్వాలిఫికేషన, గత అనుభవం క్లుప్తంగా వివరించి, ఆ వీడియోని అప్‌లోడ్ చేస్తే చాలు. అలా అప్‌లోడ్ చేసిన వీడియో రెజ్యూమెను హ్యాపీ మైండ్స్ తమతో టై అప్ అయిన కంపెనీలకు చేర వేస్తుంది.
ఇప్పుడు చాలా కార్పొరేట్ సంస్థలు క్వాలిఫి కేషన, అనుభవంతోపాటు అభ్యర్ధి బాడీ లాంగ్వేజ్, వాయిస్, ఐ కాంటాక్ట్, కాన్ఫిడెన్స్ గమనిస్తున్నాయి. అలాంటివన్నీ సాధారణ సీవీలో పొందు పరచలేం. ఇలా వీడియో రెజ్యూమెలో అయితే సంస్థలు తమకు కావల్సిన కాండిడేట్‌ని సుల భంగా ఎంచుకోగలుగుతాయి. వీడియోల ద్వారా హెచఆర్ పని మరింత సులభతరమవుతుంది. ఎందుకంటే వీడియో ప్రొఫైల్ చూడటం వల్ల ప్రిలిమినరీ రౌండ్ ఇంటర్వ్యూ చేయాల్సిన అవ సరం ఉండదు. ప్రొఫైల్ నచ్చితే తర్వాతి రౌండ్‌కి సెలక్ట్ చేసుకోవచ్చు.
హైదరాబాద్‌కి చెందిన హ్యాపీమైండ్స్ సొల్యూ షన్స్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వీడియో రెజ్యూమె కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది. అటు రిక్రూటర్ల సమయాన్ని, అభ్యర్ధుల వ్యయ ప్రయాసలను ఒక్క యాప్ ద్వారా పరిష్కరించ గలిగింది. గంటలకొద్దీ జరగాల్సిన ఇంటర్వ్యూలు ఎంతో సులభంగా, తక్కువ సమయంలో జరుగు తున్నాయని సంస్థ ఫౌండర్ కమ్ సీఈవో లీలా ధర్ రావు తెలిపారు. ప్రస్తుతానికి 21 కార్పొరేట్ కంపెనీలతో హ్యాపీమైండ్స్ టై అప్ అయిం దన్నారు. చాటింగ్ ద్వారా విద్యార్ధుల సందేహా లకు సమాధానాలిచ్చే ప్లాట్‌ఫాం కూడా ఇందులో ఉంది.
రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సులభతరం చేయడంతో పాటు జాబ్ సీకర్స్, రిక్రూటర్స్ సమ యాన్ని సేవ్ చేస్తున్న హ్యాపీ మైండ్స్... త్వరలో ఇండియా అంతటా విస్తరించాలనేది ఫ్యూచర్ ప్లానగా పెట్టుకుంది.
No comments:
Post a Comment