Tuesday 7 February 2017

ఎస్‌బీఐ కొలువుల జాతర

ఎస్‌బీఐ కొలువుల జాతర


2,313 పీవో పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ జారీ
దరఖాస్తు గడువు మార్చి 6
తొలిసారిగా డిగ్రీ ఫైనల్‌ విద్యార్థులకూ చాన్స్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో కొలువుల జాతరకు తెరలేచింది. భారీ సంఖ్యలో ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 2,313 పోస్టుల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మధ్య కాలంలో, అందునా అధికారిక స్థాయి పోస్టులతో విడుదలైన భారీ ప్రకటన ఇదేనని చెప్పొచ్చు. ఏ డిసిప్లినలోనైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌/ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును తొలిసారిగా ఎస్‌బీఐ కల్పించింది. సివిల్స్‌ మాదిరిగానే జనరల్‌ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే పీవో పరీక్ష రాసేలా నిబంధనను సవరించింది. మెయిన్ ఎగ్జామ్‌లో నేరుగా జనరల్‌ అవేర్‌సెస్‌ ఒక టాపిక్‌గా ఉంది. దానిని జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నె్‌స్‌గా మార్చింది. అలాగే రీజనింగ్‌లోనే కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ను కలిపేసింది. ప్రిలిమినరీ పరీక్షను యథాతథంగా ఉంచింది.
మొత్తం పోస్టుల్లో 1010 జనరల్‌, 606 ఓబీసీ, 347 ఎస్సీ, 350 ఎస్టీ వర్గాలకు ప్రత్యేకించారు. కొద్దికాలంగా అనుసరిస్తున్న మాదిరిగానే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌ల ద్వారా ఇంటర్య్వూకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏప్రిల్‌ 29, 30, మే 6, 7 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ పట్టణాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఒక పోస్టుకు 20మంది చొప్పున మెయిన పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన పరీక్షను జూన 4న ఆనలైనలో నిర్వహిస్తారు. ఏపీలో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్‌లో మాత్రమే మెయిన పరీక్ష ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 6 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

No comments:

Post a Comment