గ్రూప్-2 సర్వీసెస్ కోసం
‘పంచాయతీ’ పోస్టులకు 5,65,798
గ్రూప్-1కు 93,386 మంది..
26న గ్రూప్-2 స్ర్కీనింగ్: ఏపీపీఎస్సీ
గ్రూప్-2 సర్వీసెస్ (నోటిఫికేషన్ నం.18/2016) ఉద్యోగాల కోసం మొత్తం 6,57,010 అప్లికేషన్లు ఏపీపీఎస్సీకి అందాయి. విశాఖపట్నం జిల్లా నుంచి అత్యధికంగా 74,536 మంది, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి 64,107 మంది, కర్నూలు జిల్లా నుంచి 56,188 మంది, హైదరాబాద్ నుంచి 53,063 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 సర్వీసెస్‌కు ఈ నెల 26న ప్రిలిమినరీ పరీక్ష (స్ర్కీనింగ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. పంచాయతీ కార్యదర్శి (నోటిఫికేషన్ నం.29/2016) ఉద్యోగాల కోసం 5,65,798 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రూప్-1 సర్వీసెస్ ఉద్యోగాల కోసం 93,386 దరఖాస్తులు వచ్చాయి. అలాగే హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఉద్యోగాల కోసం 47,811 మంది, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 38,841 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి (నోటిఫికేషన్ నం.27/2016) ఉద్యోగాలకు 32,239 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏ నోటిఫికేషన్‌కు అయినా సరే 25 వేలకు పైబడి దరఖాస్తులు అందితే స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వై.వి.ఎస్.టి.శాయి తెలిపారు.
ఇతర నోటిఫికేషన్లకు అందిన దరఖాస్తులు ఇలా
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు(నోటిఫికేషన్ నం. 19/2016) 1541, టెక్నికల్ అసిస్టెంట్ (20/2016)కు 233, ఫిషరీస్ అభివృద్ధి అధికారి (21/2016) ఉద్యోగాలకు 107, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (22/2016)కు 1279, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ (23/2016)కు 1757, అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్ అండ్ సర్వేయర్స్ (24/2016)కు 22,963, క్లినికల్ సైకాలజిస్ట్‌కు 71, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్‌కు 16,899 మంది, అసిస్టెంట్ కెమిస్ట్ కు 1247, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ 1564, అగ్రికల్చర్ అధికారి ఉద్యోగాలకు 2144, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌కు 362 దరఖాస్తులు అందాయి.
నం.19 నుంచి 24 నోటిఫికేషన్‌కు పరీక్షా కేంద్రాల రీఆప్షన్
నోటిఫికేషన్ నం.19 నుంచి 24 వరకు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడైనా పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు ‘రీ ఆప్షన్’కు అవకాశం ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి తెలిపారు. గతంలో విజయవాడ, గుంటూరులో మాత్రమే సెంటర్లు ఇవ్వగా, అభ్యర్థుల వెసులుబాటు కోసం అన్ని జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు సెంటర్ల రీ ఆప్షన్‌కు అవకాశం ఉందని తెలిపారు. ఆయా నోటిపికేషన్ పోస్టులకు మార్చిలో రాత పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

No comments:
Post a Comment