Monday 30 January 2017

ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష

ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష


‘గ్రామీణాభివృద్ధి’ ప్రధానం
ఏపీపీఎస్సీ నిర్వహించనున్న పంచాయతీ కార్యదర్శుల పరీక్షలో గ్రామీణాభివృద్ధి అంశాలే కీలకమైనవి. అభ్యర్థులకు గ్రామీణాభివృద్ధిపై ఉన్న సమగ్ర అవగాహనను పరీక్షించేలా ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు ఉంటాయి. ఈ అంశాలపై నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఎలా ప్రిపేర్‌ అవ్వాలో తెలుసుకొందాం.
భారత్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామం
                    ఈ అంశంపై అవగాహన ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచే ఉండాలి. మౌర్యుల కాలంలో ‘ఇండికా’లో తెలిపిన పట్టణ పరిపాలన, చోళుల కాలంలో గ్రామ పరిపాలన, ఉత్తరమేరూర్‌ శాసనంలోని అంశాలు, మధ్యయుగం షేర్‌షా ప్రవేశపెట్టిన సంస్కరణలు, బ్రిటీషర్లు వచ్చిన తరవాత లార్డ్‌ మెయో కాలంలో చేసిన తీర్మానం, లార్డ్‌ రిప్పన చేసిన తీర్మానం, రాయల్‌ కమిషన ఇచ్చిన నివేదిక వంటి వాటిని అధ్యయనం చేయాలి.
స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో భారత రాజ్యాంగంలోని అధికరణ 40, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌-1952, నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ స్కీమ్‌, బల్వంతరాయ్‌ మెహతా కమిషన రిపోర్ట్‌ 1957, అశోక్‌మెహతా కమిషన, దంతవాలా కమిటీ, హనుమంతరావు కమిటీ, జి.వి.కె.రావు కమిటీ, ఎల్‌.ఎం.సింఘ్వి కమిటీ నివేదికలను పరిశీలించాలి. రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలు, తుంగన కమిటీ నివేదిక, పి.వి.నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 73, 74వ రాజ్యాంగ సవరణలు తెలుసుకోవాలి. మద్రాస్‌ గ్రామ పంచాయతీ చట్టం-1950, మద్రాస్‌ డిసి్ట్రక్ట్స్‌ బోర్డ్‌ చట్టం 1950, ఆంధ్రప్రదేశ గ్రామ పంచాయతీ చట్టం 1950, హైదరాబాద్‌ గ్రామ పంచాయతీ చట్టం 1956 వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.
ఇవే కాకుండా బల్వంతరాయ్‌ మెహతా కమిటీ నివేదిక తరవాత పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామం, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ పంచాయతీ సమితి- జిల్లా పరిషత చట్టం 1959, ఆంధ్రప్రదేశ గ్రామ పంచాయతీ చట్టం 1964, ఆంధ్రప్రదేశ మండల ప్రజాపరిషత(ఎంపిపి), జిల్లా ప్రజాపరిషత (జెడ్‌పిపి), జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్షా మండల్‌(జెడ్‌ఎఎస్‌ఎం) చట్టం 1986, ఆంధ్రప్రదేశ పంచాయతీరాజ్‌ చట్టం 1994, ఆంధ్రప్రదేశ పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ యాక్ట్‌ 1998పై అవగాహన అవసరం. చివరగా ఎన.టి.రామారావు కాలంలో ప్రవేశపెట్టిన మండల విధానం గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి.
ఆంధ్రప్రదేశలో గ్రామీణాభివృద్ధి పథకాలు
ఈ అంశంపై అభ్యర్థి ప్రిపేర్‌ అయ్యేటప్పుడు కేవలం గ్రామీణాభివృద్ధి పథకాలే కాకుండా మొత్తం ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలి. అది కరెంట్‌ అఫైర్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏపీలో అమల్లో ఉన్న పథకాలను గురించిన సమగ్ర సమాచారాన్ని అభ్యర్థులు సేకరించుకోవాలి. అవి...
ఆరోగ్య రక్ష పథకం, స్వాస్త్య విద్యావాహిని, అందరికీ ఆరోగ్యం, చంద్రన్న భీమా, ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌, రైతు బంధు, ఎనటిఆర్‌ భరోసా, ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన, బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి, సీ్త్రనిధి సహకార పరపతి సంఘం, భూమి పథకం, కృషి పథకం, ఉన్నతి పథకం, అభయహస్తం, వడ్డీలేని రుణాలు, జన్మభూమి- మా ఊరు, నీరు-చెట్టు, పంట సంజీవని, ఎనటిఆర్‌ జలశ్రీ, వాడ వాడలో చంద్రన్న బాట, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌, స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డ్‌ టువార్డ్స్‌ స్మార్ట్‌ ఏపీ మొదలైనవి.
పైన తెలిపిన అంశాలే కాక పంచాయతీ కార్యదర్శి విధులు, గ్రామీణాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శి పాత్ర వంటి విషయాలను కూడా తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పరపతి సాధనాలు, సహకార సంఘాల పాత్ర, స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా స్ర్కీనింగ్‌, మెయిన పరీక్షకు ఒకేసారి ప్రిపేర్‌ అయినట్లు అవుతుంది.
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం పంచాయతీ సంస్థల కోసం చేసిన వివిధ చట్టాలపై అవగాహన వచ్చాక, పంచాయతీరాజ్‌ వ్యవస్థపై నియమించిన కమిటీలు, వాటి నివేదికల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎం.ఆర్‌. పాయ్‌ కమిటీ(1963), ఎం.టి.రాజు కమిటీ(1967), జలగం వెంగళరావు కమిటీ(1968), సి.నరసింహ్మన కమిటీ(1978), చివరగా బిపిఆర్‌ విఠల్‌ కమిటీ(1991).
వీటి తరవాత ఆంధ్రప్రదేశ పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఎస్సీ/ఎస్టీ/బీసీ మహిళలకు ఉన్న రిజర్వేషన శాతాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, 2007లో ఏర్పాటు చేసిన జిల్లా ప్రణాళిక కమిటీలు, ఆంధ్రప్రదేశ పంచాయతీరాజ్‌(సవరణ) చట్టం 1998, ఆంధ్రప్రదేశ పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ రూల్స్‌ 2011పై కూడా అవగాహన పెంచుకోవాలి.
ఇవేకాకుండా రాజ్యాంగంలోని విభాగం తొమ్మిది, విభాగం 9(ఎ), అలాగే 11, 12 షెడ్యూళ్లపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. విభాగం 9లో ఉన్న అధికరణ 243(జి), విభాగం 9(ఎ)లో ఉన్న అధికరణ 243(డబ్ల్యూ) ముఖ్యమైనవి.
ఆంధ్రప్రదేశలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామం
ఈ అంశంపై పూర్తి అవగాహన రావా లంటే శాతవాహనుల కాలం నుంచే అధ్య యనం మొదలు పెట్టాలి. ఐదుగురు సభ్యు ల(పంచస్‌)తో గ్రామాల్లో పంచాయతీ ల ఏర్పాటు, కుల పంచాయతీల ఏర్పాటు, వేం గీ చాళుక్యుల కాలంలో పంచాయతీ విధా నం, కాక తీయుల కాలంలోని ఆయగార్ల వ్యవస్థ, విజయనగర సామ్రాజ్య కాలంలో స్థానిక పరిపాలన గురించి తెలుసుకోవాలి.

No comments:

Post a Comment