Thursday 29 December 2016

GROUP 3 NEW SYLLABUS-2016

www.psc.ap.gov.in

GROUP-3 NEW SYLLABUS - 2016
(PANCHAYATH SECRETARY)

🔲గ్రూప్‌-3కి కొత్త సిలబస్‌ 


ఖరారు చేసిన ఏపీపీఎస్సీ1,054 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

గ్రూప్‌-3 సర్వీసె్‌సకు (పంచాయతీ కార్యదర్శులు) కొత్త సిలబ్‌సను ఏపీపీఎస్సీ శుక్రవారం ఖరారు చేసింది.

 స్ర్కీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌కు ఒకే సిలబస్‌ ఉంటుంది.

 అయితే స్ర్కీనింగ్‌ టెస్ట్‌తో పోలిస్తే మెయిన్స్‌ సిలబస్‌ మరింత విపులంగా, విస్తృత స్థాయిలో ఉంటుంది.

 www.psc.ap.gov.in వెబ్‌సైట్లో కొత్త సిలబస్‌ అందుబాటులో ఉంది. 

స్ర్కీనింగ్‌ టెస్ట్‌ సిలబ్‌సలో 

కరెంట్‌ అఫైర్స్‌, 
బేసిక్‌ జనరల్‌ సైన్స్‌, 
ఆధునిక భారత దేశ చరిత్ర, 
భారతలో ఆర్థికాభివృద్ధి, 
భారత రాజ్యాంగం, 
ఏపీ పునర్విభజన-పరిణామాలు, 
భారతలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ, 
ఏపీ పంచాయతీరాజ్‌ వ్యవస్థ, 
ఏపీ పంచాయితీరాజ్‌ అభివృద్ధి పథకాలు,
రూరల్‌ ఎకానమీ ఆఫ్‌ ఏపీ, 
రూరల్‌ క్రెడిట్‌ సినారియో ఆఫ్‌ ఏపీ, మహిళాసాధికారత, ఆర్థిక పురోభివృద్ధి, 
లాజికల్‌ రీజనింగ్‌, 
ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ 
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 
తదితర 13 అంశాలు ఉన్నాయి. 

మెయిన్స్‌ సిలబ్‌సను రెండు పేపర్లుగా విభజించారు.

 పేపర్‌-1లో 
జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి. 

పేపర్‌-2లో 
గ్రామీణాభివృద్ధిపై, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై ప్రశ్నలు ఉంటాయి.

 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. 

మెయిన్‌ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌గా 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

 మొత్తం మీద స్ర్కీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు, మెయిన్స్‌ 300 మార్కులకు నిర్వహిస్తారు. 

ఈ కొత్త సిలబ్‌సతోనే 1,054 పంచాయితీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 

ఏదేని డిగ్రీ కలిగిన వారికి అర్హత ఉంటుంది. 

ఈ ఏడాది జూలై 1 నాటికి 42 సంవత్సరాలకు మించని వారందరూ అర్హులే.
   www.psc.ap.gov.in

No comments:

Post a Comment